7.8 బిలియన్‌ డాలర్ల లక్ష్య సాధనకు ప్రణాళిక
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

7.8 బిలియన్‌ డాలర్ల లక్ష్య సాధనకు ప్రణాళిక

‘ఎంపెడా’ ఛైర్మన్‌ కె.ఎస్‌.శ్రీనివాస్‌


ప్రసంగిస్తున్న ఎంపెడా ఛైర్మన్‌ కె.ఎస్‌.శ్రీనివాస్‌, చిత్రంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి బి.వి.ఆర్‌.సుబ్రహ్మణ్యం

ఈనాడు, విశాఖపట్నం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.8 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయి సముద్ర ఉత్పత్తులను దేశం నుంచి ఎగుమతి చేయాలని ఎంపెడా ఛైర్మన్‌ కె.ఎస్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్లో ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం- వాణిజ్య ఉత్సవం’ కార్యక్రమంలో భాగంగా ఆయన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా) అధికారులు, ఎగుమతిదారులతో సమావేశమయ్యారు. 7.8 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి ‘ఎంపెడా’ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరంలో సంతృప్తికర స్థాయిలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలిగామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గణనీయమైన వృద్ధి నమోదు కావాలని సూచించారు. వివిధ దేశాలకు భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల సరళిని ఆయన వివరించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి బి.వి.ఆర్‌.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆయా సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. చైనా, మరికొన్ని దేశాలకు ఎగుమతులు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఫొఫాండి, ఏపీ రీజియన్‌ అధ్యక్షుడు ఇంద్రకుమార్‌ తదితరులు మాట్లాడుతూ సరకు రవాణా ఛార్జీలు తగ్గించాలని, ఎగుమతులకు కంటైనర్ల కొరత వేధిస్తోందని, అధికారుల నుంచి అనుమతులను వేగంగా ఇవ్వాలని వివరించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 45 మంది ఎగుమతిదారులు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని