దేవాదాయ శాఖ ఆధీనంలోకి బాల వినాయక ఆలయం
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

దేవాదాయ శాఖ ఆధీనంలోకి బాల వినాయక ఆలయం

బాల వినాయక దేవాలయం

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలిలోని బాల వినాయక ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటూ ఆ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ ఆదేశాలిచ్చారు. 1970లో అప్పటి గ్రామపెద్దలు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. 1990లో విగ్రహ, శిఖర ప్రతిష్ఠ జరిగింది. ఏటా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఏటా జనవరిలో వినాయకుని తీర్థ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గణేష్‌ సంబంధిత అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా అధికారులు ఆలయాన్ని పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు 1014 నంబరుతో పబ్లికేషన్‌ ఇచ్చారు. త్వరలోనే ఆలయ కమిటీ ఏర్పాటయ్యే అవకాశముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని