‘చంపావతి’లో అన్నదమ్ముల మృతి
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

‘చంపావతి’లో అన్నదమ్ముల మృతి

మృతదేహాల వద్ద విలపిస్తున్న బంధువులు

న్యూస్‌టుడే, భోగాపురం/పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద చంపావతి నదిలో ఇద్దరు విద్యార్థుల  ప్రాణాలు కోల్పోవడం  విషాదం నింపింది. కోనాడకు చెందిన కారి ఆనంద్‌ (14), నరేష్‌ (19) అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం పదేళ్ల కిందటే తల్లి అమ్మోరు ముగ్గురు కుమారులతో కలిసి విశాఖ వెళ్లారు. దినసరి కూలి పనులు చేసుకుంటూ ఏవీఎన్‌ కళాశాల  సమీపంలో ఉంటున్నారు.  వారాల పండగ కోసం రెండ్రోజుల కిందట కోనాడకు వచ్చారు. అన్నయ్య సతీష్‌తో పాటు ఆనంద్‌, నరేష్‌...మరికొందరుస్నానానికి చంపావతికి వెళ్లారు. అక్కడ ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులను గమనించలేదు. ఆనంద్‌ నదిలో కొంత దూరం వెళ్లి మునిగిపోతున్న సమయంలో కాపాడేందుకు నరేష్‌ కూడా వెళ్లాడు. ఇద్దరూ మునిగిపోతుండటంతో మిగతా వారు ఒడ్డుకు చేరుకొని వారిని కాపాడాలని అక్కడున్న వారిని వేడుకున్నారు. కొందరు డబ్బులు అడిగి స్పందించడంలో జాప్యం చేశారు. ఈలోగా గ్రామానికి వెళ్లి చెప్పడంతో స్థానికులు వచ్చి ఇద్దర్నీ ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్నారని భావించి ద్విచక్ర వాహనాలపైనే సుందరపేట ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు బంధువు లక్ష్మణ్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ శ్రీధర్‌, ఎస్సై జయంతి, తహసీల్దారు కృష్ణమూర్తి వివరాలు సేకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని