Published : 09/05/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై అవగాహన.. నియంత్రణకు చర్యలు

బలిజిపేట: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా గృహాలకే పరిమితం కావాలని ఎస్సై ఎ.నరేశ్‌ సూచించారు. ఇలా చేస్తే కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తమవంతు కృషి చేస్తామని ఆయన మైక్‌ ద్వారా సూచించారు. ఆదివారం బలిజిపేట, వెంగాపురం, తుమరాడ, పలగర గ్రామాల్లో ప్రత్యేక వాహనంపై వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ప్రజలు ఎవరికి వారు బయటికి రాకుండా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు, శానిటైజర్లతో రావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సైలు పాణిగ్రహి, శ్రీరాములు నాయుడు, పాపారావు పాల్గొన్నారు.

* కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం చర్యలు చేపట్టింది. చిలకలపల్లి, వంతరాం, బలిజిపేట గ్రామాల్లో ఆదివారం సర్పంచుల ఆధ్వర్యంలో వీధుల్లో ప్రత్యేక వాహనంపై హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు సూచన మేరకు ఎంపీడీవో అప్పారావు, ఈవోపీఆర్డీ దేవకుమార్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చిలకలపల్లిలో సర్పంచి ఎ.సుందర్‌రావు గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రధాన వీధిలో ప్రత్యేక వాహనంతో వెళ్లి స్వయంగా రసాయన ద్రావణం పిచికారీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని