మనస్తాపంతో ఆత్మహత్య
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

మనస్తాపంతో ఆత్మహత్య


అప్పలనాయుడు (పాతచిత్రం)

ఎస్‌.కోట, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్‌.కోట పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లోవరాజు వివరాల మేరకు.. ఎల్‌.కోట మండలం చందులూరుకు చెందిన రావాడ అప్పలనాయుడు(45) మద్యం తాగి, భార్య గణపతితో తరచూ గొడవ పడుతుండేవాడు. దసరా రోజున మద్యం తాగి ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. దీంతో భార్య కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. శనివారం ఉదయం ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. మద్యం మానేయాలని, మూడు రోజుల్లో పంపుతామని వారు చెప్పారు. ఇప్పుడే పంపాలని అప్పలనాయుడు అడగగా ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అప్పలనాయుడు ఎస్‌.కోట వచ్చి పుణ్యగిరి కళాశాల ఎదురుగా ఉన్న తుప్పల్లో ఉరివేసుకున్నాడు. దీనిపై తమ్ముడు దేముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని