Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


సమావేశంలో మాట్లాడుతున్న ములుగు ఏఎస్పీ సాయిచైతన్య

ములుగు, న్యూస్‌టుడే: కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు ఏఎస్పీ సాయి చైతన్య అన్నారు. మంగళవారం ములుగు పోలీసు స్టేషన్‌ ఆవరణలో పట్టణ వర్తక వాణిజ్యవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులు స్వచ్ఛందంగా రాత్రి 7 గంటలకే తమ దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. దుకాణాలలో ఎక్కువ మంది గుమికూడకుండా ఉండేలా వినియోగదారులకు సూచనలు చేయాలన్నారు. మాస్క్‌ లేకుండా దుకాణంలోకి ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ రాత్రి సమయంలో బయటకు రాకూడదని ప్రజలను కోరారు. ఆదేశాలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ గుంటి శ్రీధర్‌, ఎస్సై హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు సహకరించాలి

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్‌ఆలం కోరారు. మంగళవారం ఏటూరునాగారం పోలీస్‌ స్టేషన్లో స్థానిక వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్థులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిందన్నారు. పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని, నిబంధనలు పాటించాలని, సామూహిక కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. సీఐ కిరణ్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని