HYD: భక్తుల కోలాహలం మధ్య సాగర్‌కు చేరువవుతున్న మహాగణపతి
eenadu telugu news
Published : 19/09/2021 13:00 IST

HYD: భక్తుల కోలాహలం మధ్య సాగర్‌కు చేరువవుతున్న మహాగణపతి

హైదరాబాద్‌: భక్తుల కోలాహలం మధ్య వినాయకుడి శోభాయాత్ర సందడిగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ మహాగణపతి యాత్ర తెలుగు తల్లి ఫైఓవర్‌ వరకు చేరుకుంది. గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపు బాలాపూర్‌ గణపతి సైతం నిమజ్జనానికి హుస్సేన్‌ సాగర్‌ వైపు కదిలాడు. పది అడుగులు ఆపై ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌ వైపు మళ్లిస్తున్నారు. పది అడుగుల లోపు విగ్రహాలు ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌లో నిమజ్జనం చేస్తున్నారు. వీటితో పాటు నగరం శివారుల్లోని జలాశయాల్లో నిమజ్జనం కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని