ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఎండీకి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారం
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఎండీకి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారం

పురస్కారంతో కేవీబీ రెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారం అందుకున్నారు. నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తోన్న వ్యక్తుల్ని కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ ఏటా సన్మానించడంతో పాటు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారం అందజేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ముంబయి వేదికగా జరిగిన వేడుకల్లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌-2020 పురస్కారాన్ని కేవీబీ రెడ్డి అందుకున్నారు. వినూత్న పద్ధతుల్లో హైదరాబాద్‌ మెట్రో నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే పలు పురస్కారాలు అందుకోగా.. ఈ గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని