close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

16న ఓటర్ల తుది జాబితా

తప్పులు సరిచేసే పనిలో అధికారులు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

మున్సిపల్‌ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను ఈ నెల 16వ తేదీన ప్రకటిస్తారు. అదేరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన వివరాలు వెల్లడించనున్నారు. అధికారులు మొదట విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14వ తేదీన ఓటర్ల తుది జాబితాతో పాటు సామాజికవర్గాల వారీగా ఓటర్ల గణనను ప్రకటించాల్సి ఉండగా.. మంగళవారానికి వాయిదా వేశారు. సామాజికవర్గాల ఓటర్ల జాబితాలో తప్పులు వెలుగుచూడడంతో ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. అధికారులు ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేసే

పనిలో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆయా చోట్ల ఈ నెల 10వ తేదీన ఓటర్ల ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో అభ్యంతరాలను తీసుకున్నారు. 13న అభ్యంతరాలను పరిశీలించి ఆదివారం ఓటర్ల తుది జాబితా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా అది కాస్తా 16వ తేదీకి వాయిదా వేస్తూ జీవో జారీ చేశారు.

తప్పులే తప్పులు

ఓటర్ల జాబితాలో చాలా తప్పులున్నాయి. దీనికి తోడు సామాజికవర్గాల ఓటర్ల గణన సరిగా చేపట్టలేదు. ఒకవైపు ఎన్నికల కమిషన్‌, మరోవైపు ఉన్నతాధికారులు ఒత్తిడితేవడంతో లెక్కింపు ఆదరాబాదరాగా చేపట్టారు. దీంతో చాలా పొరపాట్లు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్‌ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ పట్టణాల్లో ఓటర్ల జాబితాలు సరిగా లేవు. చాలాచోట్ల ఓట్లు తారుమారయ్యాయి. స్థానిక డివిజన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో కాకుండా వేరే డివిజన్‌లోకి ఓట్లు వెళ్లాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డిలో సామాజికవర్గాల ఓటర్ల గణనలో తప్పులు దొర్లాయి. ఎస్సీ, ఎస్టీలను బీసీ ఓటర్లుగా, బీసీ ఓటర్లను ఎస్సీలుగా పేర్కొన్నారు. అభ్యంతరాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయి. వాటిని ఒకేరోజులో సరి చేయడం సాధ్యమయ్యేపనికాదు. ఈ నేపథ్యంలో 16వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అభ్యంతరాలు స్వీకరించేందుకు మాత్రం సమయం ఇవ్వలేదు.

21న పోలింగ్‌ కేంద్రాల జాబితా

పురపాలక సంఘాల్లో పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఇది వరకే గుర్తించారు. వాటి తుది జాబితాను ఈ నెల 19న ప్రకటించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశారు. పోలింగ్‌ కేంద్రాల వివరాలు సరిచేసి ఈ నెల 21న తుది జాబితా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మారిన షెడ్యూల్‌ ప్రకటన

* 16న మున్సిపాలిటీల వారీగా పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా సిద్ధం చేయాలి.

* 17న పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా ప్రకటన

* 17న మధ్యాహ్నం 3 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్‌ కమిషనర్లు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.

* 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సరిచేసి అదే రోజు మున్సిపల్‌ కమిషనర్లు తుది జాబితాను కలెక్టర్‌కు సమర్పిస్తారు.

* 21వ తేదీన కలెక్టర్లు ఆమోదించిన తర్వాత మున్సిపల్‌ కమిషనర్లు పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.