పాఠశాలకు చేయూతనిస్తాం - Kurnool - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

 పాఠశాలకు చేయూతనిస్తాం

సన్మాన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలు బి.క్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1975-76 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలకు, గురువులకు రుణం తీసుకునే సమయం వచ్చిందన్నారు. పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తామని పేర్కొన్నారు. అనంతరం గురువులు సుబ్బయ్య, రామయ్య, చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోపీకృష్ణ, సురేష్‌కుమార్, రామ్మోహన్‌రావు, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.