close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అర్జీలు @ 855
సమస్యలు వింటున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డిల్లీరావు తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’కు భారీగా అర్జీలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి ఉదయం 9 గంటలకే అర్జీదారులంతా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సిబ్బంది అర్జీలు రాయించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. 10 గంటలకు ఇన్‌చార్జి కలెక్టర్‌ డిల్లీరావు, రెండో జేసీ సుబ్బరాజు, డీఆర్వో సుబ్బారెడ్డి, ఇతర అధికారులంతా ప్రజాదర్బార్‌ హాలుకు చేరుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 855 అర్జీలు వచ్చాయి.

భరోసా కల్పించండి

దేవుని మాన్యం భూములను సాగు చేస్తున్నాం. రైతు భరోసా పథకం అమలు చేయాలని కోరుతూ సోమవారం పెద్దసంఖ్యలో అర్చకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ తరతరాల నుంచి ఆలయ భూములను సాగు చేసుకుంటూ అర్చక వృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు, పంటనష్ట పరిహారం, పంటల బీమా వంటి పథకాలు వర్తింపజేయడం లేదన్నారు. రెవెన్యూ రికార్డులో అనుభవదారుడిగా అర్చకుల పేరు నమోదు చేసి, రాయితీలు వర్తించేలా చూడాలని ఆయన కోరారు. రహదారి ప్రమాదాల్లో అర్చకులు మరణిస్తే ఆర్థిక సాయం అందించాలని, వైద్య కార్డులు ఇవ్వాలని ఇన్‌ఛార్జి కలెక్టరును వేడుకున్నారు.

* జిల్లాలో 371 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పశుపోషకులకు సేవలందిస్తున్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని, విధుల్లో గాయపడిన గోపాలమిత్రలకు తక్షణ సాయం కింద రూ.20 వేలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం అధ్యక్షుడు వెంకటేశులు తదితరులు కోరారు.

* నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఎలాంటి ఆర్థికపరమైన అంశాలు వర్తించవు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని పలువురు ఉద్యోగులు వేడుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.