close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

అటవీ భూమి హక్కుకు దరఖాస్తు

లక్ష్మీనగర్‌(అనంతపురం): అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు వాటిపై హక్కును పొందేందుకు వచ్చే జనవరి 14లోపు ఆయా మండల తహసీల్దారు, జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ డీటీడబ్ల్యూవో కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది ఉగాది పండగ రోజూ భూమి హక్కులను గిరిజనులకు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.


 

రాయితీపై రవాణా వాహనం

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉద్యాన పంటలు పండించే రైతులకు రాయితీతో రవాణా వాహనం మంజూరు చేశామని ఉద్యానశాఖ ఉప సంచాలకులు సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆ శాఖ కార్యాలయం వద్ద ఉత్పత్తిదారుల సంఘానికి వాహనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వాహనం మొత్తం ధర రూ.22 లక్షలు, అందులో రాయితీ రూ.9 లక్షలు పోను, మిగిలిన రూ.13 లక్షలు రైతు ఉత్పత్తిదారుల సంఘం భరించాల్సి వస్తోందని డీడీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏడీ-1 సతీష్‌, ఏడీ-2 చంద్రశేఖర్‌, అనంతపురం ఉద్యానాధికారి చందన, ఎంపీఈవో హేమ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.