close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

వర్షంలోనూ వినతుల హోరు

కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన అర్జీదారులు

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు

 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : రెండు వారాలుగా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం జరక్కపోవడంతో ఈ సోమవారం జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున అర్జీదారులు హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అర్జీదారులు తరలి వచ్చారు. కలెక్టరేట్‌ ప్రాంగణం అంతా వారితో నిండిపోయింది. జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు, జేసీ వినోద్‌కుమార్‌, జేసీ-2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్‌ సదా భార్గవి, డీఆర్‌వో మల్లికార్జున, జడ్పీ సీఈవో సుశీల ఇతర అధికారులంతా అందుబాటులో ఉండి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చినవారిలో అత్యధికంగా భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, వేతనాలు, పింఛన్లు, రెవెన్యూ సమస్యలపై రాగా, ఇతర డిమాండ్ల సాధన కోసం పలు సంఘాలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకు 29,008 అర్జీలు వచ్చాయని, అందులో 25,243 పరిష్కారం అయ్యాయని, పెండింగ్‌లో మరో 3,675 అర్జీలున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

*నెల్లూరు నగరం పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన పోలమ్మ తన కుటుంబసభ్యులతో కలసి కలెక్టరేట్‌కు వచ్చింది. రెండేళ్ల క్రితం పొర్లుకట్టవద్ద బాణసంచా పేలి తాము సర్వం కోల్పోయామని, తాను మంటల్లో తీవ్రంగా గాయపడ్డానని, ఏ పని చేయలేక, పిల్లలను పస్తులు ఉంచే పరిస్థితి వచ్చిందని అధికారులకు వినతిపత్రం అందజేసి బోరున విలపించింది. తనకు పింఛను ఇప్పించాలని, రేషన్‌ కూడా కొంత కాలంగా ఇవ్వడం లేదని కలెక్టర్‌కు తెలిపింది. స్పందించిన ఆయన సంబంధిత అధికారులను పిలిపించి, అక్కడికక్కడే వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దాంతో పోలమ్మ కుటుంబం ఆయనకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసింది.

వాచ్‌మెన్‌ డ్యూటీ వేయాలి

సీతారామపురం మండలం అయ్యవారిపల్లికి చెందిన షేక్‌ చిన్న ఖాజావళి సీతారామపురం బీసీ హాస్టల్‌లో పొరుగు సేవల కింద గత మూడేళ్లుగా కామాటిగా పనిచేస్తున్నారు. ఆయన పూర్తిగా దివ్యాంగుడు కావడంతో తన తండ్రి సహాయంతో పనిచేస్తుంటాడు. ఇటీవల ఆయన తండ్రికి వయసు అయిపోవడంతో పనులు చేయలేకపోతున్నారు. దాంతో ఖాజావళి కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమానికి వచ్చి తాను కామాటిగా పనిచేయలేకపోతున్నానని, తనకు రాత్రి వాచ్‌మెన్‌గా విధులు వేస్తే.. తన తండ్రి సహకారంతో సక్రమంగా విధులు నిర్వర్తిస్తానని అర్జీ సమర్పించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ అధికారి రాజేశ్వరికి సూచించారు

స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితులు

​​​​​​​
పోలమ్మ, కుటుంబసభ్యులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.