శుక్రవారం, డిసెంబర్ 06, 2019
మాట్లాడుతున్న కమిషనర్ సుశాంత కేపడి
ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: భవిష్యనిధి కార్యాలయం పరిధిలోని సభ్యులందరికి మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకొన్నట్లు నిజామాబాద్ పీఎఫ్ కమిషనర్ సుశాంత కేపడి అన్నారు. నిజామాబాద్‌లోని పీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కమిషనర్ సుశాంత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యాలయం పరిధిలో ఎక్కువగా బీడీ కార్మికులు సభ్యులుగా ఉన్నారన్నారు. వారందరికి ఉత్తమ సేవలు అందేలా సిబ్బంది పని చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సభ్యులకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్లు శివలింగం, రజత్ రామేశ్వర్ బనాడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు