close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

ఆలోచనలతో అంకురాలు...

విజ్ఞాన ప్రదర్శనలో నమూనాలు

విద్యార్థులు, ఉపాధ్యాయుల నైపుణ్యాలను బయటపెట్టేందుకు విజ్ఞాన ప్రదర్శన వేదికైంది. మనసులో మెదలిన ఆలోచనలకు పదును పెట్టి అంకురాలను తయారు చేశారు. తక్కువ ఖర్చుతో సృజనాత్మకతతో వివిధ అంశాలతో తయారు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిట్టిబుర్రలతో మనసులో మెదలిన ఆలోచనలకు అద్దంపట్టేలా రూపొందించిన నమూనాలను నల్గొండలోని డాన్‌బాస్కో పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలను వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తిలకించారు. ఆదివారం ప్రదర్శన ముగియనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రదర్శనలను తిలకించేందుకు అవకాశం కల్పించారు.

- నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే


ధ్వని ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి

ప్రదర్శన: ధ్వని ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని చూపించడం

రూపొందించిన విద్యార్థి: శివకుమార్‌

సహకరించిన ఉపాధ్యాయుడు: దేవకుమార్‌

పాఠశాల: జి.ప.ఉ.పా కొండమల్లేపల్లి

వినియోగించిన సామగ్రి: బ్లూటూత్‌ స్పీకర్‌, మిర్రర్‌, లేజర్‌లైట్‌, అట్ట పెట్టె

ప్రయోగ ప్రదర్శన ఉద్దేశం: సముద్రంలోని అలలు టర్బయిన్‌లకు తగిలినప్పుడు విద్యుత్‌ బయటకు పంపిస్తుందని రుజువు చేసే ప్రయత్నం. నమూనాలో బ్లూటూత్‌ స్పీకర్‌లు పనిచేసేప్పుడు ధ్వనిశబ్దానికి బయటి నుంచి లేజర్‌ లైట్‌ అద్దంమీద పడినప్పుడు విద్యుత్‌ తరంగాలు ఎదురుగా డబ్బాలో ఏర్పాటు చేసిన పరదా మీద కదులుతూ ఉంటాయి.


తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి ప్రక్రియ

ప్రదర్శన: తక్కువ ఖర్చుతో నీటిశుద్ధి

రూపొందించిన విద్యార్థి: వి.భానుప్రసాద్‌

సహకరించిన ఉపాధ్యాయురాలు: భవాని

పాఠశాల: ఎంజేపీబీసీ గురుకుల పాఠశాల, కనగల్‌

వినియోగించిన సామగ్రి: 5 ప్లాస్టిక్‌ నీటి సీసాలు

ఉద్దేశం: వాడిపాడేసిన 5 ప్లాస్టిక్‌ సీసాలు తీసుకున్నారు. ఒక దానిలో చార్‌కోల్‌, మరోసీసాలో చిన్న చిన్న రాళ్లు, మరో సీసాలో జూట్‌ వేశారు. ఇంకో సీసాను మెంబ్రేన్‌ ఛాంబర్‌లా వినియోగించారు. మొదటి సీసాలో నీరును పోసేలా ఏర్పాటు చేస్తే చివరికి వచ్చే వరకు మంచినీరు బయటకు వస్తుంది. తక్కువ ఖర్చుతో నీరు శుద్ధి. చేసుకొనేలా రూపొందించారు.


శుభ్రం చేసే రోబోట్‌

.

ప్రదర్శన: మారుతున్న కాలంలో రోబోట్‌ ద్వారా చెత్తను శుభ్రం చేయడం

రూపొందించిన విద్యార్థి: ఆర్‌.మధు

సహకరించిన ఉపాధ్యాయుడు: స్కైలాబ్‌

పాఠశాల: జి.ప.ఉ.పా., బకల్‌వాడి

వినియోగించిన సామగ్రి: డీసీమోటర్‌, స్టీల్‌ఫ్యాన్‌, స్విచ్‌, కార్డుబోర్డు అట్ట, పైప్‌, చక్రాలు, ఐస్‌క్రీం పుల్లలు

ప్రయోగ ప్రదర్శన ఉద్దేశం: చెత్తను శుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణకు రోబోట్‌లను వినియోగించవచ్చని ప్రదర్శనలో చూపారు. చెత్త వల్ల పర్యావరణం దెబ్బతింటున్నందున రోబోట్‌ల వినియోగించి చెత్తను శుభ్రం చేయవచ్చని నిరూపించారు. ఈ నమూనా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెబుతున్నారు.


శుభ్రత, మంచి ఆహారంతో ఆరోగ్యం

ప్రదర్శన: శుభ్రత- ఆరోగ్యం

రూపొందించిన విద్యార్థి: ఫనూస్‌ఫర్‌హత్‌

సహకరించిన అధ్యాపకుడు: బొడ్డుపల్లి రామకృష్ణ

కళాశాల: శ్రీరాఘవేంద్ర బీఈడీ కళాశాల, నల్గొండ

వినియోగించిన సామగ్రి: మానవ శరీరం అవయవాల నమూనా మోడల్‌, వివిధ రకాల పప్పులు, ఆకుకూరలు, పండ్లు, విటమిన్లు ఉన్న ఇతర ఆహార పదార్ధాలు

ప్రదర్శన ఉద్దేశం: పిల్లలకు శుభ్రత, ఆరోగ్యం గురించి బోధించేప్పుడు విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, అవి శరీరంలోని అవయవాల మీద ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా అర్థవంతంగా చెప్పవచ్ఛు బోధనలో విద్యార్థులు సులువుగా జ్ఞాపకం ఉండేలా వస్తువును చూపిస్తూ వాటి ప్రభావాన్ని వివరించడం వల్ల పిల్లలు సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రత్యక్షంగా మోడల్‌లో చూపించడం వల్ల మరిచిపోకుండా ఉండే అవకాశం ఉంది.


కోతులు, అడవిపందులను తరిమేసే తుపాకీ

ప్రదర్శన: మంకీి గన్‌

రూపొందించిన విద్యార్థులు: హన్మంతు, నాని

సహకరించిన ఉపాధ్యాయుడు: పందిరి నర్సింహారెడ్డి

పాఠశాల: ప్రభుత్వ ఉన్నత పాఠశాల దేవరకొండ

వినియోగించిన వస్తువులు: రెండున్నర అంగుళాలసైజు పైపు రెండు అడుగులు, ఒకటిన్నర అంగుళాల పైపు రెండు అడుగులు, ఒక మూత, గ్యాస్‌లైటర్‌, క్యాల్షియం కార్బైడ్‌

ప్రదర్శన ఉద్దేశం: పంట పొలాల్లో రైతులు కోతులు, అడవి పందుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలను కోతులు, అడవిపందులు నాశనం చేస్తుంటాయి. మంకీ గన్‌లో క్యాల్షియం కార్బైడ్‌ ముక్క వేసి కొన్ని నీళ్లు పొసి, నిమిషం ఆగాక లైటర్‌ను వినియోగిస్తే పెద్ద శబ్దం వస్తుంది. దీంతో కోతులు, అడవి పందులు పారిపోతాయి. దీనివల్ల రైతులకు ఎంతో లబ్ధి ఉంటుందని విద్యార్థులు వివరించారు. రూ.500 కంటే తక్కువ ఖర్చుతో దీనిని తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.


రకరకాలుగా వినియోగమయ్యే పొయ్యి

ప్రదర్శన: బహుళప్రయోజనాల పొయ్యి

రూపొందించిన విద్యార్థిని: పి.నవనీత

సహకరించిన ఉపాధ్యాయుడు: ఇమ్రాన్‌

పాఠశాల: సాందీప్‌ ఉన్నత పాఠశాల, నల్గొండ

వినియోగించిన సామగ్రి: రాగి పైపులు, గ్యాస్‌పొయ్యి, కుక్కర్‌, నీటిసీసాలు, బయోగ్యాస్‌ కోసం రెండు సీసాలు

ప్రయోగ ప్రదర్శన ఉద్దేశం: ఇంటి వద్ద బయోగ్యాస్‌ వినియోగించి వంటచేస్తున్న క్రమంలో వృథా అయ్యే ఊష్ణాన్ని వినియోగించుకునేలా రూపొందించారు. పొయ్యిమీద కుక్కర్‌లో వంట చేసుకోవడంతో పాటు అదే మంటలో రాగి పైపులు ఏర్పాటు చేశారు. ఆ పైపుల గుండా ప్రయాణించే నీరు వేడి అవుతుందని చూపారు. ఆ వేడి నీటిని అవసరాలకు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. కుక్కర్‌ విజిల్‌ వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఆవిరి పైన ఏర్పాటు చేసిన చక్రానికి తగిలి విద్యుత్‌ బల్బులు వెలగడం వంటి వాటిని ఈ ప్రదర్శనలో రూపొందించారు. బయోగ్యాస్‌ ద్వారా వచ్చిన వ్యర్థాలను పక్కనే తోటలోకి పంపి సాగుచేసుకోవడంను నమూనాలో ప్రదర్శించారు.


తక్కువ ఖర్చుతో ఫాగింగ్‌ యంత్రం

ప్రదర్శన: దోమల నియంత్రణకు ఇంటికి అవసరమయ్యేలా తక్కువ ఖర్చుతో ఫాగింగ్‌ యంత్రం తయారు చేసుకోవడం

రూపొందించిన విద్యార్థి: కె.శివమణి

సహకరించిన ఉపాధ్యాయుడు: సలీం

పాఠశాల: ప్రభుత్వ ఉన్నత పాఠశాల డైట్‌, నల్గొండ

వినియోగించిన సామగ్రి: వేడిచేసే యంత్రం, స్ప్రేయర్‌సీసా, కెమికల్‌ పెరిత్రిన్‌ 2 శాతం, 98 శాతం నీరు.(వాస్తవానికి మునిసిపాలిటీల్లో వినియోగించే ఫాగింగ్‌ యంత్రంలో కిరోసిన్‌ వాడుతారు. దీని వల్ల ఎక్కువ పొగ వస్తుంది. ప్రదర్శనలో ఇతర విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కిరోసిన్‌ బదులు నీటిని వినియోగించి చూపారు)

ప్రయోగ ప్రదర్శన ఉద్దేశం: దోమల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరికి వారు తమ పరిధిలో దోమలను నియంత్రించాలి. మునిసిపాలిటీలలో వాడే ఫాగింగ్‌ యంత్రాన్ని ఇంట్లో తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేందుకు సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌లో వినియోగించే హీటింగ్‌ గన్‌కు ఏసీలకు వాడే కాపర్‌ పైప్‌లను చుట్టారు. దీనికి పైప్‌ ద్వారా ఎరిత్రిన్‌, నీరు ఉన్న స్ప్రేయర్‌ సీసాకు కనెక్ట్‌ చేశారు. స్ప్రేయర్‌ ఒత్తినప్పుడు రాగి పైపుల చివర నుంచి నీటి తుంపరలా వచ్చేలా స్ప్రే చేయడం వల్ల దోమలు నివారించవచ్చని రూపొందించారు. పెరిత్రాన్‌ ఒక లీటరు రూ.950కు లభిస్తుందని విద్యార్థి తెలిపారు. ఒక లీటరు నీటిలో కేవలం 2మి.లీ.వాడితో సరిపోతుందని వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.