close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

సరదా ట్రిప్పులంటూ నిండా ముంచేశాడు!

హాలీడే ప్యాకేజీల పేరిట ఘరానా మోసం
గ్లోబల్‌ తాజ్‌ ప్రైడ్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: లాటరీలో బహుమతి వచ్చిందంటూ నమ్మించారు. బహుమతి కోసం వెళ్లిన వారిని తెలివిగా బుట్టలో పడేశారు. తక్కువ ధరకే స్థలాలు ఇస్తామంటూ బురిడీ కొట్టించారు. ఇదంతా నిజమని భావించి డబ్బులు చెల్లించిన బాధితులు చివరకు తాము మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నగరానికి చెందిన సలావుద్దీన్‌, షఫీ అహ్మద్‌ గ్లోబల్‌ తాజ్‌ ప్రైడ్‌ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌, ఎలిషన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ పేరిట సంస్థలను ప్రారంభించారు. హాలీడే ప్యాకేజీలు తక్కువ ధరకే అందిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేసినట్టు నమ్మకం కలిగించేవారు. ఇది నిజమని భావించిన వారితో తక్కువ ధరకు ప్లాట్లు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించేవారు. ఇది నిజమని భావించిన వందలాది మంది వినియోగదారులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. రోజులు, నెలలు గడుస్తున్నా హాలీడే ప్యాకేజీ, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ అంశాలను వాయిదా వేస్తూ వచ్చేవారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ టి.ఎం.ఎన్‌.బాబ్జి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ పి.రాజశేఖర్‌ దర్యాప్తు చేశారు. కేసులో ప్రధాననిందితుడు సలావుద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. నిర్వాహకుల ప్రకటనలు నమ్మిన 400 మంది బాధితులు రూ.5కోట్ల వరకూ చెల్లించినట్టు నిర్ధారించారు. అమాయకుల నుంచి రాబట్టిన భారీ మొత్తంతో సలావుద్దీన్‌ నగరంలో మూడు లగ్జరీ డూప్లెక్స్‌ గృహాలు, కాచారం గ్రామంలో మూడు ప్లాట్లు, మూడు ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. ఈ కేసులో మరో  నిందితుడు సఫీ అహ్మద్‌ను ఈ నెల 6న ప్రధాన నిందితుడు సలావుద్దీన్‌ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇతడిపై ఇప్పటికే పలు కేసులున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.