close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూములు లాక్కుంటున్నారనేందుకు నిదర్శనం

● రైతు ఆత్మహత్య బాధాకరం: కోదండరాం

నర్సింలు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ప్రొ. కోదండరాం

 

వర్గల్‌, న్యూస్‌టుడే: దళితులకు ఇస్తానన్న మూడెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం ఇవ్వకుండా.. వారి వద్ద ఉన్నవి లాక్కునే ప్రయత్నం చేస్తోందనడానికి రైతు నర్సింలు ఆత్మహత్య ఒక నిదర్శనమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. నర్సింలు తన 13 గుంటల భూమి దక్కదేమోనని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవటం ఎంతో కలచి వేసిందని తెలిపారు. ఆదివారం వర్గల్‌ మండలంలోని వేలూరులో నర్సింలు కుటుంబ సభ్యులను పార్టీ నాయకులతో కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. 13 గుంటల భూమిని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెజస ఎల్లప్పుడూ పేద, బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పోరాడుతుందని.. అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఆరేళ్లలో ప్రజలకు 15 వేల ఎకరాలిచ్చి దాదాపుగా 2 లక్షల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఎద్దేవా చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తానన్న భూమి, ఆర్థిక సాయం వెంటనే అందించాలని సూచించారు. రైతు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్‌, దళిత బహుజన ప్రంట్‌ రాష్ట్ర నాయకుడు శంకర్‌, పార్టీ జిల్లా నాయకుడు నీరుడి స్వామి తదితరులున్నారు.

 

చెక్కును అందజేస్తున్న రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీ రవీందర్‌, నాయకులు

తీర్మానం లేకుండా స్వాధీనమా?: సీపీఎం

గ్రామ పంచాయతీలో ఎలాంటి తీర్మానం లేకుండానే నర్సింలు భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్లయ్య, రాజు ప్రశ్నించారు. సీఎం నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవటం దారుణమని వారన్నారు. ఆదివారం నర్సింలు కుటుంబ సభ్యులను వారు కలసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.

రూ.2 లక్షల చెక్కు అందజేత

వర్గల్‌, న్యూస్‌టుడే: రైతు బ్యాగరి నర్సింలు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవి రవీందర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం రూ.2 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఆదేశానుసారం వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించామన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఎకరం భూమి, ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు చిప్పల యాదగిరి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.