close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

ఉట్టిపడిన భక్తిభావం

ఒళ్లు గగుర్పొడిచేలా నారసాల సంబరం

ఘనంగా భద్రకాళీసమేత వీరభద్రుడి కల్యాణం


వీరభద్రుడి కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

చర్ల, న్యూస్‌టుడే: తేగడ జాతరలో ప్రధాన ఘట్టం నారసాల సంబురం. శనివారం తెల్లవారుజామున వేలమంది భక్త జనుల సాక్షిగా ఆ వీరభద్రుడిపై అమితమైన భక్తితో వీరశైవులు చేసిన నారసాల సంబురం వారిలోని భక్తిభావాన్ని ఉట్టిపడేలా చేసింది. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 2.03 గంటలకు యల్లమందల వంశీయుల్లో ఒకరైనా ఆలయ ప్రధాన పూజారి శ్రావణ్‌కుమార్‌ తొలుత నారసాలను పొడుచుకొని ఆలయ ప్రదక్షిణ చేశారు. భద్రకాళీ సమేతుడైన వీరభద్రుడిని మది నిండా ఆరాధిస్తూ భక్తులు చేసిన నీరాజనాల నడుమ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మేళతాళాలు.. శరభ.. శరభ.. జయహో వీరభద్రా.. అంటూ స్వామివారి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. యలమందల వంశీయులతో పాటు జాగరణ చేసిన భక్తులు నారసాలను బుగ్గలు, నాలుగు, మెడ భాగంలో పొడుచుకొని భక్తిని చాటుకున్నారు. ఆద్యంతం గగుర్పొడిచే ఈ క్రతువును కళ్లారా చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పోటీ పడ్డారు. వీరభద్రుడి ముందు నారసాల పొడుచుకొని ఆలయ ప్రదక్షిణ చేస్తే జీవితాంతం సుభిక్షంగా ఉంటామనే నమ్మకంతో మహిళలు, చిన్నారులు సైతం నారసాల సంబరాల్లో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటి ఆధ్యాత్మికంలో మునిగిపోయారు. అనంతరం మేకుల చెప్పులతో ఆలయ ప్రదక్షిణలు చేస్తూ వీరశైవులు పోగోళ్ల సంబరాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ఆదివాసీలు తెచ్చి సమర్పించిన బియ్యాన్ని తలంబ్రాలుగా మార్చి స్వామివారి కల్యాణంలో ఉపయోగించారు. భద్రకాళీ సమేత వీరభద్రుడి కల్యాణానికి ముందు తేగడలో తాలిపేరు నది ఒడ్డున అత్యంత భక్తిప్రపత్తులతో భక్తులు అగ్నిగుండాన్ని తొక్కారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భారీ ప్రభలను స్వామివారికి మొక్కులుగా భక్తులు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేల సంఖ్యలో ఆదివాసీలు ఈ జాతర మహోత్సవానికి తరలివచ్చారు. ఆలయంలో యల్లంమందల భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేశారు. కల్యాణం అనంతరం స్వామివారిని భక్తులు దర్శించి పూజలు చేశారు. పాతచర్లలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది.


శనివారం తెల్లవారుజామున ఊరేగింపుగా తేగడకు చేరుకున్న భారీ ప్రభ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.