close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైఎస్‌ఆర్‌ బీమా.. కొండంత అండ

లబ్ధిదారులకు బీమా పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాలకు ఆపదలు వస్తే ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో సమావేశం ద్వారా అన్ని జిల్లాల ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో సమావేశంలో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, డా.జె సుధాకర్‌, జేసీ-3 ఖాజా మొహిద్దీన్‌, డీఆర్డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష, డీఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బీమా పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.