close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రికార్డు స్థాయిలో పెరిగిన విస్తీర్ణం

మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు

జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఈ వానకాల సీజన్‌లో రికార్డు స్థాయిలో పంటలను సాగు చేశారని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నర్సింహారావు తెలిపారు. సోమవారం జోగిపేటలోని ఆ శాఖ ఏడీఏ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...గత ఐదేళ్ల సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పంటలను వేశారన్నారు. సాధారణ సాగు 6.38 లక్షల ఎకరాలుకాగా 7.70 లక్షల ఎకరాల్లో సాగైనట్లు చెప్పారు. కందిని సాధారణంగా 50 వేల ఎకరాల్లో వేస్తారని అలాంటిది ఈ సారి దాదాపు లక్ష ఎకరాల్లో సాగు చేశారన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాక్రమంలో జోగిపేట ఏడీఏ అరుణ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.