close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

కుల మతాలకతీతంగా క్రికెట్‌ పోటీలు

పోటీలను ప్రారంభిస్తున్న నరాల సుధాకర్‌

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: కులమతాలకు అతీతంగా శివరాత్రి రోజు క్రికెట్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని గాజుల్‌పేట్‌లో శుక్రవారం గాజుల్‌పేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజుల్‌పేట్‌లోని రహీం, ఫయీమ్‌, ఖయ్యూం స్థలంలో సిక్కు యువకులు దిల్‌రాజ్‌సింగ్‌, సుఖ్పాల్‌సింగ్‌, తేజ్పాల్‌సింగ్‌ 28ఏళ్ల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 14జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈనెల 21 ఉదయం వరకు సాగుతాయన్నారు. ఇందులో మెట్టు నరేందర్‌, సురన్‌సింగ్‌, మన్‌ప్రీత్‌సింగ్‌, రూపేందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.