close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి..

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న లక్ష్మీనరసింహస్వామి తదితరులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: స్వర్టీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని ఎన్టీఆర్‌ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆలిండియా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఛైర్మన్‌ లక్ష్మీ నరసింహస్వామి అన్నారు. ఎన్టీఆర్‌ కళారాధన పీఠం జాతీయ కార్యాలయాన్ని దుర్గాలమ్మ ఆలయం సమీపంలోని భవనంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని తెలియపరిచేలా పీఠం సభ్యులు ముద్రించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ మరణాంతరం కళాపీఠం స్థాపన కోసం 24ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ సహకరించలేదన్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ పెదిరెడ్ల శంకర్రావు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో భవనాన్ని సమకూర్చారన్నారు. కళాపీఠంలో ఎన్టీఆర్‌ జీవిత విశేషాల పుస్తకాలను ప్రదర్శనగా ఉంచుతున్నామన్నారు. పెదిరెడ్ల శంకర్రావు, వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ కార్యదర్శి నరవప్రకాశరావు, సోషల్‌ మీడియా రాష్ట్ర ఛైర్మన్‌ సన్‌మూర్తి, సినీనటుడు బీవీఆర్‌ మూర్తి, సంస్థ కార్యదర్శి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.