close

బుధవారం, నవంబర్ 13, 2019

తాజా వార్తలు

సత్తుపల్లిలో చోరీ

సత్తుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సత్తుపల్లి రామాలయం వీధిలో ఓ ఇంట్లో చోరి జరగ్గా స్థానిక ఠాణాలో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాలయం వీధిలో ఉండే ఆలీపాషా అనారోగ్య కారణాలతో రెండు నెలలుగా కాకర్లపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న తన సోదరుడైన ఫయాజ్‌ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలీపాషా ఇంటి తాళాలను మంగళవారం సాయంత్రం పగలగొట్టి బీరువాలోని సుమారు రూ. 1.60లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేశ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.