close

మంగళవారం, ఆగస్టు 20, 2019

తాజా వార్తలు

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ఆదోని మార్కెట్‌(కర్నూలు): విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ వెంకటరాముడు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బుధవారం ర్యాగింగ్‌ నివారణపై అవగాహనా సదస్సును పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య స్నేహపూర్వక, పోటీ వాతావరణం ఉండాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికోసం ప్రయత్నించి ముందడుగు వేయాలన్నారు. కళాశాలలో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కేసు నమోదు చేసేందుకు సైతం సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో మూడో పట్టణ సీఐ పార్థసారధి, ప్రిన్సిపల్‌ అయ్యప్ప, షీ టీం హెడ్‌కానిస్టేబుల్‌ జానకి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.