close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

దీర్ఘకాలంగా శ్వాసకు అడ్డుపడే వ్యాధి విజృంభణ 
తెలంగాణలో ప్రతి లక్ష జనాభాలో 4250-4749 మంది సీఓపీడీ వ్యాధిగ్రస్తులే 
గాలి కాలుష్యమే ప్రధాన కారణం 
‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల భారం (జీబీడీ)’పై అధ్యయనం వెల్లడి 
చలిలో తీవ్రత పెరుగుతుందంటున్న నిపుణులు

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందుకు ప్రధానంగా గాలి కాలుష్యం కారణమవుతోంది. ఇంట్లో ఉంటే వంట పొగ, బయటికెళ్తే పరిసరాల కాలుష్యం, ధూమపానం వల్ల ఈ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రపంచమంతా ఈ సమస్య ఉన్నప్పటికీ మన దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మనదేశంలోనే 18 శాతం మంది వ్యాధి పీడితులు ఉన్నారు.  మొత్తం వేర్వేరు రకాల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మంచాన పడుతున్నవారి సంఖ్య 1990లో 4-5శాతం ఉండగా.. 2016కొచ్చేసరికి 6.4 శాతానికి పెరిగింది.

2016 గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధులతో మృతిచెందినవారు 10.9శాతం. దీనివల్ల మంచానపడినవారు 6.4శాతం. ఈ వ్యాధుల్లోనూ ముఖ్యంగా దీర్ఘకాలంగా శ్వాసకు అడ్డుపడే వ్యాధి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ -సీఓపీడీ), ఆస్థమా బాధితుల సంఖ్య అధికంగా ఉంది. 2016 గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రతి లక్ష జనాభాలో 4250-4749 మంది సీఓపీడీ వ్యాధిగ్రస్తులే కాగా, రాష్ట్రంలో ఆస్థమా బాధితులు 2750-3249గా నమోదయ్యారు.  పరిసరాల గాలి కాలుష్యం కారణంగా మహిళలు, పురుషుల్లోనూ దాదాపు 33.5శాతం మంది సీఓపీడీ బారిన పడుతున్నారు. ఇళ్లలో గాలి కాలుష్యం మహిళల్ని పట్టి పీడిస్తోంది. దీనివల్ల దాదాపు 30.1 శాతం మంది మహిళలు సీఓపీడీ బారినపడి అవస్థలు పడుతున్నారు. తాగి వదిలేసిన పొగను పీల్చడం వల్ల అత్యధికంగా మహిళలు బాధితులుగా మారుతున్నారు. 1990-2016 మధ్యన ‘ది గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌’ అధ్యయనం ఈ గణాంకాలను వెల్లడించింది. 2016లో 9వ స్థానంలో ఉన్న దీర్ఘకాలంగా శ్వాసకు అడ్డుపడే వ్యాధి.. 2040 నాటికి 4వ స్థానానికి ఎగబాకనుందని అధ్యయనం వెల్లడించడం ఆందోళన కలిగించే అంశమే.

అధ్యయనంలోని ప్రధానాంశాలు 
మొత్తం దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల్లో అత్యధికంగా సీఓపీడీ కారణంగా 75.6 శాతం మంది దీర్ఘకాలంగా మంచానికే పరిమితమవుతుండగా.. ఆస్థమాతో 20 శాతం మంది మంచాన పడుతున్నారు. 
సీఓపీడీ మరణాలు 1990లో మన దేశంలో 6.24 లక్షలు కాగా, 2016లో 8.48 లక్షలుగా నమోదైంది. 
సీఓపీడీ కేసుల సంఖ్య గత 25 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. 1990లో 28.1 మిలియన్ల మంది ఈ వ్యాధికి గురవగా.. 2016కు వచ్చేసరికి ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 55.3 మిలియన్లకు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

దీనివల్ల దీర్ఘకాలంగా మంచానపడినవారు 4.8శాతం. ఇలా మంచానపడడానికి ధూమపానం నాలుగోవంతు కారణమవుతోంది.

1990లో ఆస్థమాతో మరణాలు అంత గుర్తింపులేని సంఖ్యలో ఉండగా.. 2016లో మాత్రం 1.83 లక్షలుగా గుర్తించారు. దీనివల్ల మంచానపడేవారు 1.3శాతం. 

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

తెలంగాణలో సీఓపీడీ 1990లో ప్రతి లక్ష జనాభాకు 2750-3249 మంది ఉండగా.. 2016లో ఈ సంఖ్య 4250-4749కి పెరిగింది. 
రాష్ట్రంలో ఆస్థమా 1990లో ప్రతి లక్ష జనాభాకు 2250-2749 మందిలో ఉండగా.. 2016లో 2750-3249కి పెరిగింది. 
ఆస్థమా కేసులు సిక్కిం, త్రిపుర, నాగాలాండ్‌, కేరళల్లో ఎక్కువగా గుర్తించారు. 

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 


దేశం మొత్తమ్మీద సీఓపీడీ కేసులు అత్యధికంగా జమ్ము కశ్మీర్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ రాష్ట్రాల్లో నమోదు కాగా.. రెండో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మిజోరాం రాష్ట్రాలున్నాయి.

చలికాలంలో అప్రమత్తత అవసరం 
ఊపిరి ఆడనివ్వని కాలుష్యం - డాక్టర్‌ శుభాకర్‌, ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు 
సీఓపీడీ వచ్చినవారిలో శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇటీవల కాలంలో మగాళ్లతో పోల్చితే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు ఆ పొగ కారణంగా సీఓపీడీ బారినపడుతున్నారు. సీఓపీడీ అనేది ఒక జబ్బు కాదు. ఇది మొత్తం శరీరంలోని అవయవాలపైనా దుష్ప్రభావం చూపుతుంది. చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు తొలుత దాడిచేసేది సీఓపీడీ బాధితులనే. వీరు చల్లగాలుల్లో తిరగడం మానేయాలి. వ్యాధుల బారినపడకుండా ఇన్‌ఫ్లూయెంజా, నిమోకొకల్‌ టీకాలను చలికాలం రాకముందే వేయించుకోవాలి.

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

 

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

 

ఊపిరి ఆడనివ్వని కాలుష్యం 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.