
కాలం గడియారం
నుంచి రాలి
కనురెప్పల మధ్య ఆగిపోయింది..
తనని చూసిన
ఆ క్షణాన..!!
- శ్రీనివాస్
ఒక్కప్పుడు నా వాట్సాప్ చాట్ లిస్ట్‌లో మొదటుండే పేరు.
ఇప్పుడు.. ఆ లిస్ట్‌ని ఎంతలా స్క్రోల్ చేసినా కనిపించని పేరు.. మా ప్రేమ ‘వెర్షన్’ మారింది!
- ఎన్జీ

ఆ కళ్లు ఎన్నో సార్లు నన్ను చూస్తున్నాయి..
కానీ, ఆమె గుండె మాత్రం క్షమించడానికి సిద్ధంగా లేదు.
- విజయ్

ఆరాధన పిచ్చితనం అయితే.. ప్రేమ కచ్చితంగా ఆకర్షణే!
ఆరాధన స్వచ్ఛంగా ఉంటే.. ఆ ప్రేమని ప్రేమ కచ్చితంగా ప్రేమిస్తుంది.. ప్రపోజల్ అక్కర్లేదు.
- నాగ్