అన్నీ తానై.. అక్కే అమ్మ అయ్యింది!
close

తాజా వార్తలు

Published : 16/06/2021 23:49 IST

అన్నీ తానై.. అక్కే అమ్మ అయ్యింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారితో ఎన్నో హృదయవిదారకమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  లాలించి పెంచాల్సిన తల్లిదండ్రులు కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్తే.. చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఒడిశాకు చెందిన ఏడేళ్ల చిన్నారి అనాథగా మారిన నెలల వయసున్న తమ్ముడి బాధ్యతను భుజాలపైకెత్తుకుంది. తమ్ముడి బాధ్యతను ఓ కన్న తల్లిలా మారి అమ్మలేని లోటును తీరుస్తోంది. 

ఒడిశా, బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన కమలేశ్ కుటుంబాన్ని కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేసింది. కరోనా సోకి కమలేశ్‌, స్మిత దంపతులు మరణించగా వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నిమ్మత్‌పూర్‌లో కమలేశ్‌ దంపతులు నివాసం ఉండేవారు. భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో కమలేశ్‌ పనిచేయగా అతని భార్య స్మిత కటక్‌లోని  క్యాన్సర్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవారు. గర్భిణి అయిన స్మితకు ఏప్రిల్‌ 15 కొవిడ్‌ సోకడంతో కటక్‌లోని ఆసుపత్రిలో చేరారు. శిశువుకు జన్మనిచ్చిన వారం రోజులకే స్మిత కన్నుమూశారు. ఆ తర్వాత కమలేశ్‌ కూడా కొవిడ్‌ బారినపడి మరణించారు. అప్పటి నుంచి పసికందుగా ఉన్న తమ్ముడి బాధ్యతను చిన్నారి చూసుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు కమలేశ్‌ సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని