ప్రభుత్వ కళాశాల విద్యార్థులకూ ఆన్‌లైన్‌ క్లాసులు

తాజా వార్తలు

Published : 25/08/2020 17:08 IST

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకూ ఆన్‌లైన్‌ క్లాసులు

నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం 

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా బోధన నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 27 నుంచి అధ్యాపకులందరూ కళాశాలలకు హాజరుకావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కేసు తేలిన తర్వాత డిగ్రీ, యూజీ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని ప్రవేశపరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా సెప్టెంబర్‌ 1 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి ఛానల్‌, టీశాట్‌ ఛానళ్ల ద్వారా డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని