‘యాంటీబాడీలు తగ్గిపోతాయనడం తొందరపాటే’
close

తాజా వార్తలు

Published : 18/07/2020 00:09 IST

‘యాంటీబాడీలు తగ్గిపోతాయనడం తొందరపాటే’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటాయని, వారిలో దీర్ఘకాలిక రోగనిరోధకశక్తి కష్టమేనని ఇటీవల వచ్చిన అధ్యయనాలను అనేకమంది శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారికి మళ్లీ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పడం తొందరపాటే అవుతుందని పేర్కొంటున్నారు. రోగనిరోధక వ్యవస్థలో ఉండే ప్రత్యేక కణాలు భవిష్యత్‌లోనూ వారికి కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్నవారిలో ప్రతిరక్షకాలు రెండు నుంచి మూడు నెలలు మాత్రమే ఉంటున్నాయని ఇటీవల పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే యాంటీబాడీలు కోల్పోయినంత మాత్రాన వారికి మహమ్మారి తిరిగి సోకే అవకాశం ఉందని చెప్పలేమని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చేసరికి ఏడాది సమయం పట్టవచ్చని వివరించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో టి-కణాలు దాదాపు 15 ఏళ్లపాటు ఉంటూ వారికి తిరిగి వ్యాధి సోకకుండా రక్షణ కల్పిస్తాయని ఓ అధ్యయనం తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని