AP: వరుసగా రెండో రోజూ 20వేలు దాటాయి
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: వరుసగా రెండో రోజూ 20వేలు దాటాయి

అమరావతి: ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు  ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, 85 మంది మృతి చెందారు. 

విశాఖ, విజయనగరంలో 11మంది మృతి

గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని