రమణ దీక్షితుల నియామకం చట్టవిరుద్ధం
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రమణ దీక్షితుల నియామకం చట్టవిరుద్ధం

పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకునిగా కొనసాగుతుండగా ప్రభుత్వం రమణ దీక్షితులను నియమించటం చట్టవిరుద్ధమని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 74ఏళ్ల వ్యక్తిని ప్రధాన అర్చకులుగా నియమించారన్నారు. మరోవైపు నిబంధనల ప్రకారమే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని