ఏలూరు ఓట్ల లెక్కింపు తేదీ వెల్లడించిన ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 12:43 IST

ఏలూరు ఓట్ల లెక్కింపు తేదీ వెల్లడించిన ఎస్‌ఈసీ

ఏర్పాట్లు చేయాలని ఆదేశం

అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తేదీని ప్రకటించింది. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరక లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది.

ఏలూరు నగరపాలక సంస్థకు మార్చి 10న ఎన్నికలు జరిగాయి. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిపేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎస్‌ఈసీ తాజాగా ఆదేశాలు జారీచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని