నీటిపారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తాజా వార్తలు

Updated : 06/07/2021 16:09 IST

నీటిపారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల అంశంపై  సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈనెల 9న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈనేపథ్యంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని