ప్రత్యర్థులుగా తల్లీకూతుళ్లు

తాజా వార్తలు

Updated : 15/01/2020 08:54 IST

ప్రత్యర్థులుగా తల్లీకూతుళ్లు

సాధారణంగా ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కుటుంబ సభ్యులు ఒక్కటిగా నిలిచి గెలుపే ధ్యేయంగా ప్రచారం చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పురపాలక సంఘం ఎన్నికల్లో తల్లీ, కుమార్తె ప్రత్యర్థులుగా పోటీకి దిగారు. పులికంటి నాగమ్మ(కాంగ్రెస్‌), ఆమె కుమార్తె పులికంటి అలివేలు(తెరాస)లు 5వ వార్డు నుంచి బరిలో దిగారు. ఆమనగల్లు పట్టణానికి చెందిన పులికంటి నాగమ్మ కుమార్తె అలివేలు అదే పట్టణానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ వార్డులో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

- న్యూస్‌టుడే, ఆమనగల్లు

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని