పెళ్లయిన కాసేపటికే వరుడి మృతి

తాజా వార్తలు

Updated : 15/02/2020 11:29 IST

పెళ్లయిన కాసేపటికే వరుడి మృతి

బోధన్‌ గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు. గణేశ్‌కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు.

అప్రమత్తమైన బంధువులు వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2గంటల సమయంలో గుండెపోటుతో వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసి ఇంటికి తీసుకువచ్చిన భర్త కొద్ది సేపటికే దూరమయ్యాడంటూ వధువు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమతో హుషారుగా నృత్యం చేసిన వరుడు మృతి చెందడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని