భక్తులు లేకుండానే భద్రాద్రి కల్యాణం: పువ్వాడ
close

తాజా వార్తలు

Updated : 17/03/2020 16:33 IST

భక్తులు లేకుండానే భద్రాద్రి కల్యాణం: పువ్వాడ

ఖమ్మం: కరోనా వైరస్‌ ప్రభావం భద్రాద్రి రామయ్యపై కూడా పడింది. భద్రాచలంలో ఏటా వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం ఈసారి నిరాడంబరంగా జరగనుంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకలు కేవలం ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2న జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులు లేకుండానే జరుగుతుందని వెల్లడించారు.

కరోనా కట్టడికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్కులు మూసివేసిన విషయం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని