హైదరాబాద్‌లో రెడ్‌జోన్‌లు లేవు: ఈటల

తాజా వార్తలు

Updated : 28/03/2020 17:06 IST

హైదరాబాద్‌లో రెడ్‌జోన్‌లు లేవు: ఈటల

హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఈ మహమ్మారిని కుటుంబ సభ్యులకు అంటగట్టారన్నారు. గచ్చిబౌలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ గాలితో వచ్చే రోగం కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో వస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఒక్క బాధితుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. అనవసర సమాచారంతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారు. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన ఆరు రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని