నెమళ్లను చూసైనా నేర్చుకోండి..

తాజా వార్తలు

Published : 11/04/2020 20:41 IST

నెమళ్లను చూసైనా నేర్చుకోండి..

సామాజిక దూరంపై జాతీయ పక్షి సందేశం

నాగౌర్: ‘సామాజిక దూరం’.. కొద్ది నెలలుగా ఈ పదం వినని వారు లేరంటే అతిశయోక్తిలేదు. ఏ మందూమాకూ లేని కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి ఇదే ఇప్పుడు తారకమంత్రం. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు నిత్యం సూచిస్తున్నా.. ఇప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. కానీ, మన జాతీయ పక్షులు నెమళ్లు మాత్రం ఆ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్నాయి. వాటి తీరు ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఓ అటవీశాఖ అధికారి చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

రాజస్థాన్‌లోని నాగౌర్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడు నెమళ్లు సామాజిక దూరం పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈ ఆకట్టుకొనే దృశ్యం ఐఎఫ్ఎస్‌ అధికారి పర్వీన్ కాశ్వాన్‌ కంటపడింది. తన దృష్టికి వచ్చిన ఆ చిత్రాన్ని వెంటనే ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక దూరాన్ని ఎలా పాటించాలో మన జాతీయ పక్షి నెమలి నుంచి నేర్చుకోవాలి. నాగౌర్‌లోని రూన్‌ ప్రభుత్వ పాఠశాలలోనిదీ దృశ్యం’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘ఈ అందమైన ఫొటోకి ఇది సరైన సమయం’.. ‘ప్రస్తుత పరిస్థితిని నెమళ్లు సరిగా అర్థం చేసుకున్నాయి’ అంటూ ట్వీట్లు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని