యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏంటో తెలుసా!
close

తాజా వార్తలు

Published : 24/04/2020 21:18 IST

యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏంటో తెలుసా!

15 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు 15 ఏళ్లు నిండాయి. అమెరికాకు చెందిన ముగ్గురు సహోద్యోగులు స్టీవ్‌ చేన్‌, చాద్‌ హర్లే, జావేద్‌ కరీం కలిసి దీన్ని స్థాపించారు. 2005 ఏప్రిల్‌ 24న మొదటి వీడియో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో జావేద్‌ కరీం.. కాలిఫోర్నియా శాన్‌డియాగోలోని ఒక జూలో నిలబడి మాట్లాడుతూ కనిపిస్తారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆయన ఏనుగుల ముందు నిలబడి వాటి గురించి చెబుతుంటారు. ఇప్పటివరకు 90 మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. ఆ తర్వాత నెమ్మదిగా యూట్యూబ్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది.  ఈ విషయాన్ని గమనించిన గూగుల్‌.. 2006లో 1.6 బిలియన్‌ డాలర్లకు దీన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గూగుల్‌ ఆదాయ వనరుల్లో యూట్యూబ్‌ది ప్రధాన పాత్ర. దీని ద్వారా 2019 ఆర్థిక సంవత్సరంలో 15.15 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం యూట్యూబ్‌కు రెండు మిలియన్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్స్‌ ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని