ఆరోగ్యశ్రీ పరిధిలోకి విశాఖ గ్యాస్‌లీక్‌ బాధితులు

తాజా వార్తలు

Published : 07/05/2020 21:27 IST

ఆరోగ్యశ్రీ పరిధిలోకి విశాఖ గ్యాస్‌లీక్‌ బాధితులు

అమరావతి: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన బాధితులను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏదైనా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది. విశాఖతో పాటు గ్యాస్‌ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందది. ఆరోగ్యశ్రీతో అనుసంధానం అయిన ఆస్పత్రులతో పాటు అనుసంధానం కాని ఆస్పత్రులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సహాయం కోసం ఆరోగ్య శ్రీ విశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 83338 14019కు సంప్రదించగలరని ఆరోగ్య శాఖ సూచించింది.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని