మరో 24గంటలు శిబిరాల్లోనే: కన్నబాబు

తాజా వార్తలు

Updated : 10/05/2020 19:55 IST

మరో 24గంటలు శిబిరాల్లోనే: కన్నబాబు

విశాఖ: వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు, అభిప్రాయాల ఆధారంగా విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గ్యాస్‌ లీక్‌ ప్రభావిత 5 గ్రామాలు, పరిసర ప్రాంతాలు దాదాపు సురక్షిత స్థాయికి చేరుకున్నాయని కన్నబాబు చెప్పారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమ వద్ద 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందన్నారు. మరో 24 గంటల పరిశీలన తర్వాత పూర్తి స్థాయి సురక్షిత గ్రామాలుగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటివరకు గ్యాస్‌ లీక్‌ ప్రభావిత పరిసర గ్రామ ప్రజలు, కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన వ్యక్తులు శిబిరాల్లోనే ఉండాలని సూచించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కన్నబాబు వివరించారు.

దక్షిణ కొరియాలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని, ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రతినిధులను ఆదేశించినట్లు కన్నబాబు చెప్పారు. పర్యావరణం, ప్రజలపై గ్యాస్‌లీక్‌ ప్రభావం ఏమేరకు ఉండనుందో వివరిస్తూ సమగ్ర నివేదిక అందించాల్సిందిగా సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రమాద పరిసర గ్రామాల్లో నీరు, మట్టి, ఇతర నమూనాలను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలో స్టైరీన్‌ గ్యాస్‌ ట్యాంక్‌ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని మంత్రి చెప్పారు. పరిశ్రమ పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కన్నబాబు కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని