ప‌తంజ‌లి అలా ప్ర‌క‌టించొద్దు: ఆయుష్ శాఖ‌

తాజా వార్తలు

Updated : 23/06/2020 20:08 IST

ప‌తంజ‌లి అలా ప్ర‌క‌టించొద్దు: ఆయుష్ శాఖ‌

క‌రోనిల్ ఔష‌ధ వివ‌రాలు స‌మ‌ర్పించాల‌న్న‌ ప్ర‌భుత్వం

ముంబ‌యి: కొవిడ్‌-19కు ఆయుర్వేద ఔష‌ధం క‌నుగొన్నామ‌న్న ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ ప్ర‌క‌ట‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. ఔష‌ధానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. త‌మ మందుతో ఏడు రోజుల్లో క‌రోనా నుంచి విముక్తి క‌లిగింద‌న్న ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌చారం చేయొద్ద‌ని ఆదేశించింది. ఫ‌లితాల‌ను పూర్తి స్థాయిలో ప‌రిశీలించి, విశ్లేషించేంత వ‌ర‌కూ ఆగాల‌ని సూచించింది.

క‌రోనిల్‌, స్వాస‌రి పేరుతో ప‌తంజ‌లి ఆయుర్వేద మంగ‌ళ‌వారం విప‌ణిలోకి ఔష‌ధాల‌ను ఆవిష్క‌రించింది. దేశ‌వ్యాప్తంగా 280 మంది క‌రోనా బాధితుల‌పై ప్ర‌యోగాలు చేశామ‌ని వివ‌రించింది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో వంద శాతం క‌చ్చిత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ ఔష‌ధంతో మూడు రోజుల్లోనే 69 శాతం మందికి నెగెటివ్ వ‌చ్చింద‌ని, 7 రోజుల్లో అంద‌రూ కోలుకున్నార‌ని రాందేవ్ బాబా పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

పంత‌జ‌లి ఆయుర్వేద క‌నుగొన్న క‌రోనా ఔష‌ధానికి సంబంధించిన వివ‌రాల‌ను వీలైనంత‌ త్వ‌ర‌గా త‌మ‌కు అందించాల‌ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ‌ను కోరింది. అందులో ఉప‌యోగించిన మూల‌కాల ప‌రిమాణాలు, ప్ర‌యోగ ఫ‌లితాలు, ఆస్ప‌త్రుల్లో జ‌రిపిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కోసం ఆ సంస్థ న‌మోదు చేసుకుందా, నైతిక నియ‌మావ‌ళి క‌మిటీ అనుమ‌తుల వివ‌రాల‌ను కోరింది. ‘పతంజలి సంస్థ ప్ర‌క‌టించినట్టు  ప్ర‌యోగ ఫ‌లితాల్లో నిజానిజాలు మంత్రిత్వ శాఖ‌కు ఇంకా తెలియ‌వు’ అని ఆయుష్ శాఖ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని