హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ సవాంగ్‌

తాజా వార్తలు

Updated : 24/06/2020 11:55 IST

హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ సవాంగ్‌

అమరావతి: అక్రమ మద్యం రవాణాలో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టువిచారణకు డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని న్యాయస్థానంలో నిన్న పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు డీజీపీ హాజరయ్యారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది.

మద్యం అక్రమ రవాణాచేస్తూ జప్తునకు గురైన వాహనాల్ని సంబంధితమెజిస్ట్రేట్/ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ముందు ఎందుకు ఉంచడం లేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నిన్నటి విచారణలో ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు వాహనాల్ని జప్తుచేశారని, వాటిని విడుదలచేసేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై న్యాయమూర్తి సోమవారం విచారణ జరిపి డీజీపీని సుమోటో ప్రతివాదిగా చేర్చారు. డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని