AP News: శ్రీశైలంలో డ్రోన్ల సంచారం!

తాజా వార్తలు

Updated : 04/07/2021 17:59 IST

AP News: శ్రీశైలంలో డ్రోన్ల సంచారం!

శ్రీశైలం: జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో  అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది.. వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట ప్రయత్నాలు చేశారు. అసలవి డ్రోన్లా? కాదా? అని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని