కరోనా టెస్ట్‌ చేసే మాస్క్‌.. 90 నిమిషాల్లో ఫలితం!

తాజా వార్తలు

Published : 30/06/2021 01:04 IST

కరోనా టెస్ట్‌ చేసే మాస్క్‌.. 90 నిమిషాల్లో ఫలితం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను నిర్థరించడానికి ప్రస్తుతం రాపిడ్‌, ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిల్లోనూ స్వాబ్‌ ద్వారా ముక్కులో నుంచి నామూనాలు సేకరించాల్సి ఉంటుంది. ఇది కాస్త నొప్పితో కూడుకున్నది. అందుకే ఎలాంటి నొప్పి లేకుండా కరోనా వైరస్‌ను గుర్తించే మాస్క్‌ను హార్వర్డ్‌ యూనివర్సిటీ, మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంయుక్తంగా రూపొందించాయి. ఈ మాస్క్‌ను ధరిస్తే కరోనా సోకిందో లేదో కేవలం 90 నిమిషాల్లోనే టెస్ట్‌ చేసి చెప్పేస్తుందట. దీని ఫలితాలు ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టు ఫలితాలంతా కచ్చితత్వంతో ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

మాస్క్‌ను శాస్త్రవేత్తలు ఫ్రీజ్‌-డ్రైయిడ్‌ సెల్‌-ఫ్రీ టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో బయోసెన్సార్లను అమర్చామని, అవి మాస్క్‌ ధరించిన వ్యక్తి శ్వాసను గ్రహించి అందులో వైరస్‌ను గుర్తిస్తాయని పేర్కొన్నారు. మాస్క్‌కు ఒక బటన్‌ అమర్చారు. దీన్ని నొక్కినప్పుడు ఫ్రీజ్‌-డ్రయిడ్‌ బయోలాజికల్‌ రియాక్షన్‌ మొదలవుతుంది. ఊపిరి వదిలినప్పుడు వెలువడిన శ్వాసనే నమూనాగా సేకరించి పీసీఆర్‌ పద్ధతిలోనే టెస్ట్‌ చేసి వైరస్‌ను గుర్తిస్తుందట. మరోవైపు మాస్క్‌కు డిజిటల్‌ సిగ్నల్‌ ఉంటుంది, దీనికి సంబంధించి ప్రత్యేక యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మాస్క్‌ టెస్ట్‌ పూర్తయిన వెంటనే ఫలితాలు యాప్‌లో కనిపిస్తాయి. 90 నిమిషాల్లోనే మాస్క్‌ కరోనా టెస్ట్‌ నిర్వహించి ఫలితాలను అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఈ మాస్క్‌లను పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేసే కంపెనీల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని