పెళ్లి దోషం.. 13 ఏళ్ల బాలుడితో టీచర్‌ పెళ్లి..!
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 04:55 IST

పెళ్లి దోషం.. 13 ఏళ్ల బాలుడితో టీచర్‌ పెళ్లి..!

జలంధర్‌: దేశం శాస్త్ర- సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలను వీడట్లేదు. ఓ ఉపాధ్యాయురాలు తనకు పెళ్లి దోషం ఉందని మైనర్‌ బాలుడిని బలవంతంగా పెళ్లి చేసుకున్న విచిత్ర ఘటన పంజాబ్‌లోని జలంధర్‌ బస్తీ బావా ఖేల్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జలంధర్‌లోని బస్తీ బావా ఖేల్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలికి వయసు మీరినా పెళ్లి కావడం లేదు. దీంతో ఆమెకు పెళ్లి దోషం ఉందని, ముందుగా ఓ బాలుడితో పెళ్లి జరిపించాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. ఇది నమ్మిన సదరు ఉపాధ్యాయురాలు తన దగ్గరకు ట్యూషన్‌ కోసం వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని పెళ్లి కోసం ఎంపిక చేసుకుంది. వారం రోజులపాటు ట్యూషన్‌ చెప్పాలని బాలుడి కుటుంబంతో మాట్లాడి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం ఉపాధ్యాయురాలి కుటుంబం బాలుడితో ఆమెకు బలవంతంగా వివాహం(సింబాలిక్‌ పెళ్లి) జరిపించారు. అనంతరం ఉపాధ్యాయురాలు తన గాజులు పగులగొట్టుకొని వితంతువుగా మారింది.  

వారం రోజుల తర్వాత బాలుడు ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు తనతో బలవంతంగా ఇంటి పనులు కూడా చేయించుకున్నారని బాధిత బాలుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మైనర్‌ బాలుడిని పెళ్లి చేసుకొని వితంతువుగా మారితే దోషం పోతుందని తమ కుటుంబ పుజారి సలహా ఇచ్చినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు రాజీ చేసుకోవడంతో బాధిత కుటుంబం కేసు వాపసు తీసుకున్నట్లు పోలీసు అధికారి గగన్‌దీప్‌ సింగ్‌ సెఖాన్‌  తెలిపారు. అయితే ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని