హైకోర్టును ఆశ్రయించిన IPS రష్మీ శుక్లా

తాజా వార్తలు

Published : 04/05/2021 01:13 IST

హైకోర్టును ఆశ్రయించిన IPS రష్మీ శుక్లా

హైదరాబాద్‌: ముంబయి పోలీసులు తనను వేధిస్తున్నారంటూ మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిఘా విభాగాధిపతిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెపై ముంబయిలో కేసు నమోదైంది. అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్‌ అదనపు డీజీగా ఉన్న ఆమెను ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ సమయంలోనూ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం రష్మీ శుక్లా పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ముంబయి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై ఈ నెల 5న విచారణ చేపట్టనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని