అన్న కష్టం తీర్చిన తమ్ముడి ఫోన్‌ కాల్‌

తాజా వార్తలు

Published : 02/07/2021 01:17 IST

అన్న కష్టం తీర్చిన తమ్ముడి ఫోన్‌ కాల్‌

హైదరాబాద్‌: సోదరుని కష్టం చూడలేక తమ్ముడు చేసిన ఓ ఫోన్ కాల్ ఆ కుటుంబ కష్టాలను తీర్చింది. మెహదీపట్నంలో ఉంటున్న కృష్ణ ఉదయాన్నే పాల పాకెట్లు, పేపర్లు విక్రయించుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. కాలి నడకన చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఆలస్యమై వినియోగదారుల నుంచి చీవాట్లు తినేవాడు. ఆ సంగతి గమనించిన తన తమ్ముడు కార్తీక్ అన్న కష్టాన్ని తీర్చాలనుకున్నాడు. ‘ఈటీవీ’లో ప్రసారమైన రైస్ ఏటీఎం నిర్వాహకుడు దోసపాటి రాము ఆర్థిక సహాయ కథనాన్ని చూసి ఆయనకి ఫోన్ చేశాడు. అన్న కష్టాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన దోసపాటి రాము.. కృష్ణకు సైకిల్ కొనిస్తానని మాటిచ్చాడు. హుటాహుటినా ఓ సైకిల్ దుకాణానికి వెళ్లి కొత్త సైకిల్ కొని కార్తీక్‌కి ఇచ్చారు. దీంతో కార్తిక్, కృష్ణ కుటుంబంలో సంతోషం నెలకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని