లవణంతో లక్షణమైన చిత్రాలు

తాజా వార్తలు

Published : 27/08/2020 12:10 IST

లవణంతో లక్షణమైన చిత్రాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. దేన్నైనా కళాత్మక హృదయంతో చూస్తే  అద్భుతాలు చేయొచ్చు అనేది ఆ వ్యాఖ్య ఉద్దేశం. కెనడాకు చెందిన బషీర్‌ సుల్తానీ ఆ వ్యాఖ్య నిజమేనని నిరూపిస్తున్నారు. వంటల్లో వాడే ఉప్పు బషీర్‌కు కళాత్మక వస్తువుగా కనిపించింది. అంతే ఆ ఉప్పుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

బషీర్‌ సుల్తానీ గత తొమ్మిదేళ్లుగా రకరకాల ఆకృతులను కేవలం ఉప్పుతో చిత్రాలుగా రూపొందిస్తూ అందరినీ విస్మయపరుస్తున్నారు. మొదట్లో కేవలం తెల్లటి ఉప్పుతో మహాత్మ గాంధీ, అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లీ చాప్లిన్‌ వంటి ప్రముఖులతోపాటు.. పలు సినిమాల్లోని పాత్రలు, సినిమా టైటిల్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా చిత్రాలుగా రూపొందించారు. ఆ తర్వాత ఉప్పులో రంగులు కలిపి జీవం ఉట్టి పడే విధంగా చిత్రాలు రూపొందించడం మొదలుపెట్టారు. విశ్వం, భూమి, చంద్రుడు, పిజ్జా, బర్గర్‌, ఆమ్లెట్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ ఇలా ఎన్నింటినో తెలుపు/నలుపు ప్లేటుపై రంగుల ఉప్పుతో ఆవిష్కరించారు. వాటిని తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుండటంతో బషీర్‌ ప్రతిభపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ఆ కళాత్మక చిత్రాలను ఎలా రూపొందిచారో మీరూ చూసేయండి..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని