స్ప్రింట్‌ దిగ్గజానికి సైకత నివాళి
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:33 IST

స్ప్రింట్‌ దిగ్గజానికి సైకత నివాళి

పూరీ: కరోనా అనంతర అనారోగ్య కారణాలతో శుక్రవారం తుదిశ్వాస విడిచిన స్ప్రింట్‌ దిగ్గజం మిల్కాసింగ్‌కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో మిల్కాసింగ్ సైకత శిల్పాన్ని ఆయన శనివారం రూపొందించారు. ‘ట్రిబ్యూట్‌ టు ది లెజెండ్ (దిగ్గజానికి నివాళి)‌’ అని ఆ కళాఖండంపై రాశారు. ఈ సైకత శిల్పం ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేయగా.. నాలుగు గంటల వ్యవధిలో 11 వేలకుపైగా లైకులు దక్కించుకుంది.

మిల్కాసింగ్‌ 1929లో జన్మించారు. భారత పరుగుల వీరుడిగా అథ్లెటిక్స్‌లో చెరగని ముద్ర వేశారు. 1958, 1962 ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన ఘనతను చాటిచెప్పేందుకు 2013లో ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ పేరిట బాలీవుడ్‌లో చలనచిత్రాన్ని నిర్మించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని